వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఫీజును భారీగా పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తొలి సవాలు ఎదురైంది. ట్రంప్ నిర్ణయం అమలు కాకుండా అడ్డుకోవడానికి ఆరోగ్య బీమా సంస్థలు, మత గ్రూపులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇతరులు శుక్రవారం న్యాయస్థానంలో దావా దాఖలు చేశారు. ట్రంప్ నిర్ణయం యజమానులు, ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలను గందరగోళంలో పడేస్తుందని వారు ఆరోపించారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు కొత్తగా ఫీజును నిర్ణయిస్తూ గత నెల 19న ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని జిల్లా కోర్టులో దావా దాఖలైంది. ఆరోగ్య కార్యకర్తలు, ఎడ్యు కేటర్లను నియమించు కోవడానికి హెచ్-1బీ వీసా కార్యక్రమం దోహదపడుతుందని దావాలో వివరించారు.
దేశంలో ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి ఇది ఉపకరిస్తుందని తెలి పారు. ప్రత్యేక రంగాల్లో ఉద్యో గులను నియమించు కోవడానికి యాజమాన్యాలకు అవకాశం కల్పిస్తుందని తెలియజేశారు. కాగా ఫీజు నుంచి ఉపశమనం కల్పించని పక్షంలో ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఉండరని, చర్చిల్లో పాస్టర్లు కన్పించరని, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు కానరారని, దేశంలోని పరిశ్రమలు కీలక ఆవిష్కరణలను కోల్పోతాయని డెమొక్రసీ ఫార్వర్డ్ ఫౌండేషన్, జస్టిస్ యాక్షన్ సెంటర్ ఓ పత్రికా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్ ఆదేశాలను తక్షణమే అడ్డుకోవాలని పిటి షన్‌లో కోర్టును అభ్యర్థించామని తెలిపాయి.
హెచ్-1బీ వీసా ఫీజుపై అమెరికా కోర్టులో దావా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES