Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ను కలిసిన నాయకులు

జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ను కలిసిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గాంధీ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్,పిసిసి చీఫ్,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోర్ యాత్రలో భాగంగా ప్రతి బూత్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను గుర్తించాలి అని అన్నారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు 20% టిక్కెట్లు ఇవ్వాలి అని కోరిన జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ అక్కడే ఉన్న పిసిసి చీఫ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విక్కి యాదవ్,నరాల నిహార్, వెంకట్ రామారావు,రఘునాథ్ వివిధ అసెంబ్లీల అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్,చరణ్ గౌడ్, మెయిన్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -