- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన గాన్ల రాజు ఛత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి , సిడబ్ల్యూసి మెంబర్ తామర బరద్వాజ్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాన్ల రాజు మాట్లాడుతూ.. గాన్ల సంఘం బలోపేతం కావడానికి మాజీ ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. తెలంగాణలో గాన్లు చాలా వెనుకబాటుకు గురి అయ్యారని అన్నారు. ప్రస్తుతం వారు చాలా పేదరికంలో ఉన్నారని అన్నారు. గాన్ల కులస్తులకు ఆర్థిక సాయం అందించి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. అదేవిధంగా రాజకీయ రంగంలో గాన్ల కులస్తులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చి, రాజకీయాల అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రిని షాలువాతో ఘనంగా సన్మానించామని తెలిపారు.
- Advertisement -



