నవతెలంగాణ – మల్హర్ రావు
పదో తరగతిలో శతశాతం ఫలితాల కోసం విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.అక్టోబర్ 10 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించబోతున్నారు. మెరుగైన ఫలితాల సాధనలో భాగంగా ఈసారి కూడా అభ్యాసన దీపికలు పంపిణీ చేశారు. మండలంలో 2025-26 సంవత్సరంలో ఐదు హైస్కూల్స్, ఒక మోడల్ స్కూల్, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో మొత్తం విద్యార్థులు 194 మంది ఉన్నారు. వీరికి మొత్తం 90 అబ్యాస దిపికలు పంపిణీ చేసినట్లుగా మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు.
మండలంలో ఇలా…
1. వళ్లెంకుంటలో విద్యార్థులు..11…దిపికలు పంపిణీ…11.
2. తాడిచెర్లలో విద్యార్థులు….56…దిపికలు పంపిణీ 20.
3. పెద్దతూoడ్లలో విద్యార్థులు….ముగ్గురు….దిపికలు పంపిణీ…3.
4. రుద్రారంలో విద్యార్థులు..10…దిపికలు పంపిణీ…10.
5. మల్లారంలో విద్యార్థులు…16..దిపికలు పంపిణీ 16.
6. మోడల్ స్కూల్లో విద్యార్థులు…50…దిపికలు పంపిణీ..16.
7. కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలో విద్యార్థులు..49..దిపికలు పంపిణీ 14.