మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం పైశాచికంగా వ్యవహరిస్తోందని, అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు వెంకట్‌రాంరెడ్డి, హరీశ్‌బాలు, ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటుతున్నా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత లేదన్నారు. ఉద్యోగ విమరణ పొందిన ఉద్యోగులకు బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారని వాటిపై చర్చ జరగాలని ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిందన్నారు.
అయితే జిల్లాల్లో ఎక్కడికక్కడా తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారన్నారు. సోమవారం అసెంబ్లీ బయట జరిగిన అన్ని విషయాలనూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇలాంటి వ్యవహార శైలి వల్లే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, కాంగ్రెస్‌కు కూడా రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని హెచ్చరిం చారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఖర్చుపెట్టిన లెక్కలకు.. ప్రవేశపెట్టిన పద్దులకు పొంతనలేదన్నారు. తాము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే అరెస్టులు చేస్తున్నారన్నారు. మీరిచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆరు గారంటీలకు చట్టబద్ధత చేయాలని నిలదీస్తామన్నారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



