సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బీఆర్ఎస్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానంద సుత్తె కొడవలి నక్షత్రంపై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం భువనగిరి పట్టణం ఆరో వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానందను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా లకు ఎల్లప్పుడు అండగా ఉండి నిరంతరం ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) ను గెలిపించాలని కోరారు. ప్రభుత్వ చట్టాలు, ప్రజల హక్కుల పై అవగాహన ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం) గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ నాయకులు తుమ్మల పాండు, ముల్కల సత్యనారాయణ, గంటేపాక బిక్షపతి, నీల శ్రీనివాస్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయకృష్ణ, వంపు ప్రసాద్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకను గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



