Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిద్దాం 

మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగిద్దాం 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
మహాత్మా జ్యోతి బా పులే ఆశయాలను ముందుకు తీసుకుపోవడం లోయువత ముందుండాలని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి  పిలుపు నిచ్చారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బా పులే 135 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. జ్యోతి బా పులే అట్టడుగు వర్గాలకు విద్య ను అందించాడని, వితంతువుల, అనాధ పిల్లలను చేరదీసి విద్యా బుద్ధులను నేర్పించడం, బాలికలకు పాఠశాల లను నెలకొల్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో  సింగిల్ విండో ఛైర్మన్ బోలి శెట్టి శివయ్య ,జేఏసీ   కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవు ,మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, సిపిఐ నాయకులు కోహెడ కొమురయ్య, జేఏసీ నాయకులు నాంపల్లి సమ్మయ్య, కోడూరి శ్రీదేవి,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -