Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిగటిద్దాం..

మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిగటిద్దాం..

- Advertisement -

4 లేబర్ కోడ్ ల అమలుకు వ్యతిరేకంగా పోరాడుదాం
మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని, నాలుగు లేబర్ కోడ్ల అమలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సంఘం జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. సందర్భంగా ఆమెను మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కావున కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, టీజీ యూఈఈ యు సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరేడ్డి చంద్రరేడ్డి జిల్లా అధ్యక్షుడు నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, ప్రభాకర్, మురళి, థామస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -