Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయాలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం 

రాజకీయాలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం 

- Advertisement -

సర్పంచ్ చంద్రయ్య గౌడ్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ప్రజలందరి సహకారంతో రాజకీయాలకతీతంగా గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్ చంద్రయ్య గౌడ్ చెప్పారు. ఆదివారం మండలంలోని వాడ్యాల్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రూ.5 లక్షల సిసి రోడ్డు పనులను గ్రామ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్ అఖిలపక్ష నాయకులు విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, యాదయ్య తో కలిసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ..ఎన్నికల అప్పుడే  రాజకీయాలు చేయాలని, ఎన్నికల తర్వాత ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ అందే విధంగా అఖిలపక్ష నాయకులు సహకరించాలని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీ సభ్యులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధు కుమార్, ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు మెంబర్లు కృష్ణయ్య, దశరథం, ఉదయ్ కుమార్ , అఖిలపక్ష నాయకులు చిన్న నరసయ్య, వెంకటయ్య,  నరసింహ, సుకుమారు, మంగలి రమేష్, నారాయణ, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -