Monday, December 22, 2025
E-PAPER
Homeజిల్లాలుపార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: ప్రభుత్వ విప్ బీర్ల

పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: ప్రభుత్వ విప్ బీర్ల

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
పార్టీలకు అతీతంగా ఒక్కటై గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం సైదాపురం, మాసాయిపేట, వంగపల్లి గ్రామాల సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో బీర్ల ఐలయ్య పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన ద్వారా పల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి అని, గ్రామాలకు ఎక్కువ నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతామని అన్నారు.

ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని, గెలుపోటములు సహజమని, అందరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో తిష్ట వేసిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. పాలకవర్గం సమిష్టిగా ఒక ప్రణాళిక చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా సర్పంచ్లకు నిధులు ఇచ్చి, గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. భరోసా ఇస్తున్న పెండింగ్ పనులు ఉన్న, డ్రైనేజ్ సమస్య ఉన్న, సిసి రోడ్ల సమస్య ఉన్న, గ్రామపంచాయతీ బిల్లింగ్ల సమస్య ఉన్న ప్రజా ప్రభుత్వంలో  ముఖ్యమంత్రి తోటి కొట్లాడి నిధులు తెచ్చి అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా అన్నారు. పార్టీలకతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక సర్పంచులు అధోగతి పాలయ్యారని అన్నారు.

ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సర్పంచ్ గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోవాలని, ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీర్ల శంకర్, సర్పంచులు కళ్లెం జాంగిర్ విజయ గౌడ్, కన్నాయి రోజా , ఒగ్గు రవళి రాణా ప్రతాప్, ఉప సర్పంచ్ లు దుంబాల వెంకటరెడ్డి, సంగీత బాలకృష్ణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, వార్డు సభ్యులు ఏమాల ఎలేందర్ రెడ్డి, ఎండి ఉస్మాన్, వల్లాల హేమలత శ్రీశైలం, పాండు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -