Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ బాకీ కార్డులు ఇంటింటికీ పంచుదాం: మాజీ ఎమ్మెల్యే షిండే

కాంగ్రెస్ బాకీ కార్డులు ఇంటింటికీ పంచుదాం: మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్ట్యా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే సోమవారం మేనూరులో మద్నూర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఇప్పటీ ఎన్నికల్లో వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలుచేయలేదని విరమ్శించారు. రైతుబంధు రూ. 15వేల ఇవ్వాల్సి ఉండగా.. రూ.11 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. వృద్దులకు నెలకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. సన్నవడ్లకు బోనస్ సరిగా అందించడలేదని తెలిపారు.

తులం బంగారం హామీని తుంగలో తొక్కారని, రుణమాఫీ పూర్తిగా ఇవ్వలేదన్నారు. 420 హామీలిచ్చి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామ గ్రామానా.. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంచాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఇది మనకొక సువర్ణావకాశమన్నారు. స్పరంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్, ఆ పార్టీ సీనియర్ నాయకులు సోమూర్ కాశీనాథ్ పటేల్, మద్నూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ పాకాల వార్ విజయ్, మాజీ కోఆప్షన్ నెంబర్ నిజాముద్దీన్, ఉమ్మడి మద్నూర్ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు సురేష్, ఇరు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -