ఇట్ల చేద్దాం

ఆలివ్‌ ఆయిల్‌, చక్కెరలతో తయారుచేసిన స్క్రబ్‌ పొడిబారిన చేతులను కోమలంగా మార్చడంలో సహకరిస్తుంది. ఇందుకోసం అరకప్పు చక్కెరలో టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇందులో కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా తీసుకొని దాన్ని చేతులపై రాసుకొని రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే పొడిబారిన చేతులు తిరిగి కోమలంగా మారతాయి.

Spread the love