కెనడా, మెక్సికో నిర్ణయం
ట్రంప్ వాణిజ్య యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటం
మెక్సికో సిటీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో సమన్వయంతో వ్యవహరించాలని కెనడా, మెక్సికో నిర్ణయించాయి. 2020 నాటి అమెరికా- మెక్సికో- కనడా ఒప్పందం (యూఎస్‌ఎంసీఏ) పై అమెరికాతో సమీక్ష జరగనున్న తరుణంలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, సమన్వయంతో వ్యవహరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నే గురువారం మెక్సికోలో పర్యటించారు. ఈ సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌తో సమావేశమై ఆర్థిక, భద్రతా సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధా లను విస్తరించుకోవాలని నిర్ణయిం చామని చెప్పారు. అమెరికాతో వాణిజ్య భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రెండు దేశాలు పరస్పరం గౌరవించుకుంటూ పని చేస్తాయని షెయిన్‌బామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ సవాలు ఎదురైనప్పటికీ సహకారంతో, పరస్పర గౌరవంతో దానిని అధిగమించవచ్చునని చెప్పారు. కాగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇరు పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాము ఒకరితో ఒకరు పోటీ పడబో మని ఇరువురు నేతలు స్పష్టంచేశారు. కలసికట్టుగానే ముందుకు సాగుతా మని కార్నే చెప్పారు. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో కెనడా ప్రధాని మెక్సికోలో పర్యటిం చడం ఇదే మొదటిసారి. వాణిజ్య యుద్ధంలో రెండు దేశాలనూ ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. కెనడా ఉక్కుపై యాభై శాతం టారిఫ్‌ను, కొన్ని మెక్సికో ఔషధాలపై పాతిక శాతం సుంకాన్ని విధించారు. మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి మాదక ద్రవ్యాలు రవాణా అవుతు న్నాయన్న ఆరోపణతో ఆ దేశంపై మరో పాతిక శాతం సుంకాన్ని కూడా విధించారు. మెక్సికో, కెనడాలు అమెరికాకు వరుసగా అతి పెద్ద, రెండో అతి పెద్ద వాణిజ్య భాగ స్వాములుగా కొనసాగుతున్నాయి.