Friday, November 28, 2025
E-PAPER
Homeసినిమాహాయిగా నవ్వుకుందాం రండి

హాయిగా నవ్వుకుందాం రండి

- Advertisement -

శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘భీమవరం బల్మా’ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్‌ ఆవిష్కరణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలోని ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌. ఇంజనీరింగ్‌ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ పాటతో నవీన్‌ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం విశేషం.

గీతావిష్కరణ వేడుకలో హీరో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ,’ఈ పాట మీ అందరికీ నచ్చిందని అర్థమవుతోంది. ఈ మ్యాజిక్‌ అంతా మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిక్కీ జె మేయర్‌దే. మీ ప్రేమ వల్లే మొదటిసారి పాట కూడా పాడాను. పండుగకు సినిమా వస్తుంది అంటారు.. కాదు, తెలుగు ప్రేక్షకులకు సినిమానే ఒక పండుగ. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’ అని అన్నారు. ‘రాబోయే సంక్రాంతి చాలా ప్రత్యేకం. మన అందరి ప్రభాస్‌ సినిమాతో పాటు, ‘అనగనగా ఒక రాజు’ వస్తున్నాడు. నవీన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా ఇద్దరి పాత్రలు మీకు నచ్చుతాయి. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది’ అని మీనాక్షి చౌదరి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -