Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగర వేద్దాం

ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగర వేద్దాం

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
నవతెలంగాణ – ఆలేరు 

ఆలేరులో 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆలేర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరులో శుక్రవారం నాడు దుర్గమ్మ గుడి వద్ద నుండి రైల్వే గేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు 12 వార్డులో గల ప్రజలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. 

ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు త్రాగునీరు  మురికి కాలువలు సిసి రోడ్లు ఆలేరు లోని అన్ని వార్డులు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.వారి ద్వారా సమస్యలను నా దృష్టికి వచ్చి పరిష్కారం సులువుతుందన్నారు.కొండంత అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు అభివృద్ధి చేసేందుకు నాకు ఉమ్మడి జిల్లాలో అందరికంటే ఎక్కువ నిధులు ఇస్తున్న విషయం గుర్తు చేశారు.మొదటిసారి ఆలేరులో మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడిన నాటి బి ఆర్ ఎస్ పాలకులు అనేక అక్రమాలకు పాల్పడి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారు అన్నారు.నూతన పాలకవర్గం ఏర్పడగానే శరవేగంగా ప్రతి వార్డును సుందరికరిస్తామన్నారు.

నిధులు కూడా మంజూరి సిద్ధంగా ఉన్నాయన్నారు.12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాన్ని ప్రకటించారు. పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ కు త్వరలోనే రాష్ట్ర పదవితో సముచిత స్థానంలో ఉంచుతానన్నారు.సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి రావాలన్నారు.వారికి కో ఆప్షన్ ఇస్తానని వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు. కిలోమీటర్ పొడుగునా ప్రదర్శన కాంగ్రెస్ పార్టీ జెండాలతో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి,టి పి సి పి కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి,ఆలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎం ఏ ఎజాజ్,కట్టె గుమ్ముల సాగర్ రెడ్డి,ఎగ్గిడి శ్రీశైలం, ఎం ఎస్ విజయకుమార్,ఎండి జైనద్దీన్,ఎండి సలీం,బిజన భాస్కర్,సందుల సురేష్, శ్రీనివాస్ రెడ్డి,ఎండి బాబాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -