Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్4 లేబర్ కోడ్ల రద్దుకై ఉద్యమాన్ని తీవ్రం చేద్దాం

4 లేబర్ కోడ్ల రద్దుకై ఉద్యమాన్ని తీవ్రం చేద్దాం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: కార్పొరేట్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఐక్యంగా పోరాడుదామని కార్మిక సంఘ నేతలు పిలుపునిచ్చారు.  సార్వత్రిక సమ్మెలో భాగంగా  పట్టణంలో బాలాజీ ఫంక్షన్ హాల్ లో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎల్లన్న అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఏఐటియుసి  నాయకులు బాబురావు,టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ముత్తన్న, ఐ ఎఫ్ టి యు  నాయకులు మహమూద్ సుధాకర్ , ఏఐసీసీ టి యు నాయకులు ఇందూరు రాజయ్య, సిఐటియు నాగేష్, అంగన్వాడి గోదావరి,భీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, టి యు సి ఐ అరవింద్ ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు దేవన్న, సభలో పాల్గొని ప్రసంగించారు.

వారు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు మరణ శాసనం విధించిందని వారు తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రజాస్వామిక దేశములో చట్టాలు అని పిలుస్తారు. యజమాన్యానికి కార్మికులకు మధ్య పరస్పర అవగాహనను చట్టాలు ప్రతిబింబిస్తాయి అని వారు తెలిపారు. కానీ కోడ్స్ అంటే ఏకపక్ష విధేయతను ప్రదర్శించాలని ఆర్ఎస్ఎస్ ఉద్దేశాన్ని, ఎజెండాను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం విచారకరమని వారు అభిప్రాయపడ్డారు.

గత ఆరు సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ సర్కారు తెచ్చిన లేబర్ కొడ్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని వారు తెలిపారు. కార్మికుల త్యాగాలతో సాధించుకున్న హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాచివేస్తుందని వారు తెలిపారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26000 నిర్ణయించి అమలు చేయాలని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సామాజిక చట్టాలను వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు.

దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని, నెలకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పని హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.

మోడీ ఎన్నికల వాగ్దాన ప్రకారం నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువుల హామీ అమలు చేయాలని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ 45 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, బీడీ పరిశ్రమలు రక్షించాలని, వివో సి హమాలి కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వారి సమస్యలు పరిష్కరించాలని, మోటారు రంగ కార్మికుల ఉపాధి కాపాడాలని, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ఇచ్చి, అన్నదాత రైతా0గానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు.

మోడీ ఎన్నికల వాగ్దాన ప్రకారం రూ.60 లక్షల కోట్ల నల్ల డబ్బును బయటకు తీసి పేదల జన్ధన్ ఖాతాలో పది లక్షల చొప్పున జమ చేయాలని, ప్రశ్నించే గొంతులను, ప్రజా ఉద్యమకారులపై నిర్బంధాన్ని ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత విద్య ఆరోగ్య హక్కును అమలు చేయాలని, అందరికీ ఆరోగ్య లభించేటట్లు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. రాజ్యాంగంలో పేర్కొన్న హక్కుల రక్షణ కోసం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. 

పాత పెన్షన్ విధానాన్ని, పునరుద్ధరించాలని, అటవీ హక్కుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఆదివాసులపై దాడులు ఆపాలని వారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పట్టణంలో భారీ ప్రదర్శన… పట్టణంలో అంగడి బజార్ నుండి పాత బస్టాండ్, ఎమ్మార్ ఆఫీస్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఆంగన్ వాడి యూనియన్ సెక్టార్ లీడర్స్ లక్ష్మీ, జగదాంబ, కవిత,ఐఎఫ్టియు సొప్పరి గంగాధర్, భానుచందర్ లక్ష్మణ్  ఏఐటీయుసీ నాయకులు రాహుల్, శ్రీను సిఐటియు నాయకులు నాగన్న, సాయిలు,పోశెట్టి,  టియుసిఐ నాయకులు అరవింద్, టి శ్రీను ఐఎఫ్టియు సుధాకర్, నరాటి లక్ష్మణ్, వెంకవ్వ, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్య్షుడు టీ బూమాన్న మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల కార్యదర్శి జే సుజాత తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -