సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి జహంగీర్
నవతెలంగాణ-ఆలేరు రూరల్
మనువాదుల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున ఆలేరు సీపీఐ (ఎం) పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ ఎన్ గార్డెన్ లో “భారత రాజ్యాంగ పరిరక్షణ – సవాళ్లు” అనే అంశంపై పట్టణ కార్యదర్శి ఎం.ఏ ఇక్బాల్ అధ్యక్షతన సెమినార్ జరిగినది.
ఈ సెమినార్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎండి జహంగీర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం వల్ల దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన రిజర్వేషన్లు కనుమరుగవుతున్నాయని హెచ్చరించారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం పీడిత వర్గాలకు చేస్తున్న ద్రోహమని పేర్కొన్నారు.
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ కుల వివక్ష, అంటరానితనం వంటి రుగ్మతలు కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరగడం వెనుక మతోన్మాద శక్తుల ప్రోద్బలం ఉందని, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనస్మృతి తీసుకువచ్చి మళ్లీ బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్య రాజ్య స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగం పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను తొలగించాలని సాక్షాత్తు దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం వారి మతోన్మాద భావజాలానికి నిదర్శనం అన్నారు. రాజ్యం సర్వ మతాల సమానత్వంతో సాగాలని, కుల, మత ప్రాంతాల కతీతంగా పనిచేయాలని రాజ్యాంగం స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తూ ఆప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని ప్రజలు ఐక్యతతో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కుల, మత వైషమ్యాలను పక్కన పెట్టి సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం పరిరక్షణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు.
ఈ సెమినార్లో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి ధూపటి వెంకటేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మోరిగాడి రమేష్, కాంగ్రెస్ దళిత సంఘం నాయకులు శిఖరం శ్రీనివాసులు, న్యూ డెమోక్రసీ నాయకులు గడ్డం నాగరాజు, ఇక్కిరి శ్రీనివాస్, సుధగాని సత్య, రాజయ్య, నల్ల మాస తులసయ్య, పిక్క గణేష్, ఘనగాని మల్లేష్, బొప్పిడి యాదగిరి, చేన్న రాజేష్, సంఘీ రాజు, మధ్యబోయిన ఉప్పలయ్య, చౌడబోయిన యాదగిరి, ఎండి మతిన్, ఎండి ఖలీల్, ఎండి అఖిల్, ఎండి బద్రుద్దీన్, ఎండి అప్సర్, కే రాములు ,బర్ల సిద్దులు, పిఎన్ఎం కళాకారులు శివ, జర్నలిస్టులు మాధవరెడ్డి, దాసి శంకర్, కుమారస్వామి, పోతుగంటి సంపత్, కూళ్ల సిద్దులు, బండ మధు , భాను ప్రసాద్, బండ మహేందర్, మల్లేశం, వీరితో పాటుగా అనేకమంది ప్రజాతంత్ర వాదులు, ఈ సెమినార్కు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేసి సెమినార్లో పాల్గొన్నారు.



