Thursday, February 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం

- Advertisement -

నవతెలంగాణ- జన్నారం
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరం అశోక్ జిల్లా ఉపాధ్యక్షులు కొండగుర్ల లింగన్న అన్నారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని తాసిల్ చౌరస్తా ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి చట్టాన్ని రద్దుచేసి సంక్షేమ పథకంగా మార్చే మోడీ చర్యలను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు.

పని హక్కులపై బిజెపి ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండించాలని సూచించారు. వి బి – జి రామ్ జి చట్టం 2025 ను రద్దు చేయాలని, డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎంజిఎన్ఆర్ ఈజిఏ ను యధావిధిగా అమలు చేయాలని లేకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి లోను కాక తప్పదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకోవాలని లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు కార్మికులంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.

కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఎనిమిది గంటల పని దినం పోరాట స్ఫూర్తిని నేటి కార్మిక వర్గానికి తెలియకుండా చేసే ప్రయత్నాలకు పూనుకున్నారు. రాష్ట్రతో పాటు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పని దినాన్ని 10 గంటలకు, స్ప్రెడ్ ఓవర్ టైమును 12 గంటలకు పెంచుతూ చట్ట సవరణలు చేశారని, ఈ లేబర్ కోడులు ఈఎస్ఐ,పిఎఫ్,గ్రాట్యూటీ, పెన్షన్ మరియు ప్రసూతి ప్రయోజనాల వంటి అన్ని మింగేస్తాయన్నారు.

భవన ఇతర నిర్మాణ కార్మికులకు పని భద్రత పిఎఫ్,ఈఎస్ఐ,వెల్ఫేర్ బోర్డులో పేర్కొన్న పథకాలు ఎలా లభిస్తాయి అనే అంశంలో లేబర్ కోడ్ లో నిర్దిష్టమైన ప్రస్తావన లేదన్నారు. అలాగే అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం,జి పి, ఐకెపి,వివో ఏ,ఆర్ పి,ఉపాధి హామీ లాంటి స్కీములలో పనిచేస్తున్న వారిని కనీసం కార్మికులుగా గుర్తించలేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు దుర్గయ్య, అన్నారపు తిరుపతి, సిఐటియు మండల కార్యదర్శి అంబటి లక్ష్మణ్ సిఐటియు నాయకులు సేపూరు లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గుడ్ల రాజన్న, జి రాజలింగం, టి ఏ జి ఎస్, నాయకులు ఆత్రం రాజు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మండల నాయకులు కే బుచ్చయ్య, అక్క బత్తుల దేవయ్య  గ్రామీణ పేదల సంఘం నాయకులు దారంగుల ఎల్లయ్య,వేముల నర్సయ్య,బోడ కిషన్, నాగరాజు,మల్లేష్ ఇతర కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -