Tuesday, March 31, 2026
E-PAPER
Homeమానవినూనె వాడకం తగ్గిద్దాం ఇలా….

నూనె వాడకం తగ్గిద్దాం ఇలా….

- Advertisement -

మనం ఏ కూర చేయాలన్నా ముందుగా గుర్తొచ్చేది కూరగాయలతో పాటు వంట నూనె. తగినంత నూనె వాడి కూరలు చేస్తే ఏ సమస్యా ఉండదు. కానీ వంటల్లో ఆయిల్‌ కంటెంట్‌ పెరిగిపోతే, వివిధ రకాల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు వంట నూనెల వాడకం తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కొన్ని టిప్స్‌ ఫాలో అయితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

– చాలా కూరలు వండటానికి ఉల్లిపాయ, టమాట ముక్కలను నూనెలో వేయిస్తుంటాం. దీంతో వాటికి నూనె బాగా పట్టుకొని అవి ఉడికేదాకా వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా నేరుగా కాకుండా వీటిని ముందుగానే పేస్ట్‌లా తయారు చేసుకుంటే నూనె వాడకం తగ్గించవచ్చు. ఉల్లిపాయ, టామోటా ముక్కలను మిక్సీ పట్టి, కూరలు వండేటప్పుడు నూనెలో వేసుకుంటే త్వరగా వేగుతాయి. దీనికి ఆయిల్‌ కూడా పెద్దగా అవసరం ఉండదు.

– కూరలో ఆయిల్‌ వేయకపోతే అది మాడిపోతుంది. అయితే, కొంచెం ఓపిక పడితే ఇక్కడ కూడా నూనె వినియోగాన్ని తగ్గించవచ్చు. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని, కూర ఉడికేటప్పుడు మధ్యమధ్యలో మాడకుండా కొన్ని నీళ్లు చల్లుతూ ఉండాలి. నీళ్లు పోసినప్పుడు ఒకేసారి కాకుండా నెమ్మదిగా కలపాలి.

– కూరల్లో వివిధ సుగంధ ద్రవ్యాలు (ూజూఱషవర) కచ్చితంగా వాడుతుంటారు. జీలకర్ర, ధనియాలు, లవంగం, దాల్చినచెక్క వంటివి నూనెలో వేసినప్పుడు అవి ఎక్కువ నూనెను గ్రహిస్తాయి. ఇలా నేరుగా వేయడానికి బదులుగా, ముందుగా వీటిని పొడి చేసుకోవడం లేదా నూనె లేకుండా నేరుగా వేయించుకోవడం మంచిది. డ్రై పాన్‌లో వీటిని వేయిస్తే వాటి అసలు ఫ్లేవర్స్‌ రిలీజ్‌ అవుతాయి. వీటిని పొడిగా చేసుకున్నాక కూర వండేటప్పుడు పొడులు వేసుకోవచ్చు. దీంతో తక్కువ నూనెను గ్రహిస్తాయి. పైగా, ఇవి వంటకు మరింత రుచిని అందిస్తాయి.

– గ్రేవీలా చేసే కూరలకు చిక్కదనం కోసం ఉడికించిన పప్పు, గుమ్మడికాయ గుజ్జు, తురిమిన సొరకాయ గుజ్జు వాడాలి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి వంటకు న్యూట్రిషనల్‌ రిచ్‌నెస్‌ అందిస్తాయి. పైగా గ్రేవీ చిక్కగా వస్తుంది, ఇందుకు నూనె కూడా పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. ఈ నేచురల్‌ ఎడిటివ్స్‌తో ఫైబర్‌, విటమిన్లు అందడంతో పాటు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

– చాలా మంది కూర వండాక దానిపై ఒక చెంచా నెయ్యి లేదా నూనె పోసి గార్నిష్‌ చేస్తుంటారు. అయితే ఇలా ఆయిల్‌ కాకుండా ఫ్రెష్‌ హెర్బల్స్‌, నిమ్మరసం, మసాలా పొడితో గార్నిషింగ్‌ ట్రై చేసి చూడండి. కొత్తమీర, కసూరిమేథి, గరం మసాలా వంటివి వేసుకుంటే నూనె అవసరం లేకుండా వంట ఫ్లేవర్‌ రిచ్‌గా మారుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -