కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక తెలంగాణ కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ కారుల జేఏసీ నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు విచ్చేసి కవితకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. తెలంగాణ అస్థిత్వం కోసం పని చేసే పార్టీ అవసర ముందని వారు తెలిపారు. కవితను కలిసిన వారిలో సింగరేణి కార్మికులు, హెచ్‌ఎంఎస్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, బీసీ సంఘం, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి, ఉద్యమ కారుల జేఏసీ స్టేట్ కమిటీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ, ఆటో యూనియన్ నాయకులు, మహిళా సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకు లున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిరంతరం తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించే తమకు అందరూ మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం కవిత తెలంగాణ జాగృతి రాష్ట్ర స్థాయి కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు 23 అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జనంబాటలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, శాసనమండలిలో కవిత చేసిన ప్రసంగంపై ఆమె వారితో చర్చించారు.
సామాజిక తెలంగాణ కోసం కలిసి నడుద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



