Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి..

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి..

- Advertisement -

అదనపు కలెక్టరు కు వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

లైసెన్సుడ్ సర్వేయర్లకు గౌరవ వేతనం తోపాటు విధివిధానాలతో కూడిన గైడ్ లెన్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్లు సోమవారం ప్రజావాణి లో అదనపు కలెక్టర్ కె, సీతారామారావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఐదు నెలల పాటు శిక్షణ కల్పించిందని, అనంతరం ఉత్తీర్ణత సాధించామని లైసెన్సులు జారీ చేసి చాలా రోజులు అవుతున్నా కానీ నేటి కి విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమన్నారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా లైసెన్సు సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ వివాదాల సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయం గొప్పదని హర్షం వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగ్గ ఫలితం కావాలని, నెలవారీ గౌరవ వేతన సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్లు పంతంగి సాలయ్య, ఈట ప్రశాంత్, గోపిరెడ్డి, సునీల్, పట్టేటి రాజు, సిహెచ్ నాగార్జున, మల్లయ్య, శాంతి వర్ధన్, హరి, మహేష్, ఆంజనేయులు, సైదులు, రాజేష్, సంపత్ కుమార్, రోశయ్య, ఫజల్, నరేష్, వినీత, శ్రేయ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -