నవతెలంగాణ – బిచ్కుంద
తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి, భూభారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. ఇందులో భాగంగా బిచ్కుంద పట్టణంలోని తాహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ వేణుగోపాల్ కు మండలానికి కేటాయించిన నలుగురు లైసెన్సుడ్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన సందీప్ రెడ్డి, బసవరాజ్, రవీచంద్ర, రాజు నియామక పత్రాలు అందజేసారు. వీరి బాధ్యతలు శిక్షణ పొందిన సర్వేయర్లుగా క్షేత్రస్థాయిలో భూమి సర్వేలు చేయడం, భూముల పట్టాలు అందించడం, భూ వివాదాలు పరిష్కరించడంలో ప్రభుత్వ సర్వేయర్లకు సహాయం చేయడం, తద్వారా భూమి కొనుగోలు, అమ్మకాలను సులభతరం చేయడం తదితర సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ భారత్ ఉన్నారు.
లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్యతలు స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



