- Advertisement -
- మాదకద్రవ్య వ్యతిరేక సైనికులుగా కావాలి
- హుస్నాబాద్ లో డ్రగ్స్ రహిత ర్యాలీ
- రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
- డ్రగ్స్ క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ..జీవిత కాలాన్ని నాశనం చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని మల్లె చెట్టు చౌరస్తాలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ,యువత తో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ లో మాదకద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారు కావాలని పిలుపునిచ్చారు.
- మన పక్కన ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే 1908 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు. పాశ్చాత్య సంస్కృతి మాదక ద్రవ్యాలను మనం నిర్మూలించాలని సూచించారు. సంతోషం కోసం ,స్నేహితుల కోరిక మేరకు తాత్కాలికంగా మనం మత్తుసేవిస్తే జీవితాలు నాశనం అవుతాయన్నారు. తల్లిదండ్రులకు,కుటుంబానికి భారమై మత్తుపదార్థాలకు అలవాటు కావొద్దన్నారు.
డ్రగ్స్ వద్దు -జీవితం ముద్దు అనే నినాదంతో ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు ,ఏసీపీ సదానందం, సిఐ శ్రీనివాస్, ఎస్ ఐ లు పి లక్ష్మారెడ్డి, అభిలాష్ , చాతరాజు ప్రశాంత్ , ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -