అందమైన, ఆరోగ్యకరమైన చర్మం ఎవరు కాదనుకుంటారు. ఇందుకోసం రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. బయట మార్కెట్‌లో వీటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవంటే ఆశ్చర్యంలేదు. అయితే, మన వంటగదిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా కూడా మన చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవును అలాంటి వాటిలో అరటిపండ్లు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అరటి పండు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో బాగా పనిచేస్తుంది. చర్మం పొడిబారడం, నీరసం, నల్లటి మచ్చలు లేదా ముడతలు వంటి చర్మ సమస్యలతో బాధపడేవారికి అరటిపండు ఫేస్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది.
ఇందులోని విటమిన్ ఎ చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది, అయితే విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, నల్లటి మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అరటిపండులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి, ముడతలు, సన్నని గీతలు వంటి వద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు సహజ తేమ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి చర్మాన్ని మదువుగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అరటిపండు ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు మీకు ఎటువంటి ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. అన్ని పదార్థాలు మీ వంటగదిలో సులభంగా దొరుకుతాయి.
అరటిపండు ఫేస్ మాస్క్ కి కావలసిన పదార్థాలు
– పండిన అరటిపండు
– టీస్పూన్ తేనె
– టీస్పూన్ నిమ్మరసం లేదా పాలు.
చర్మ అవసరాలను బట్టి ఇందులో కొన్ని కలుపుకోవచ్చు.
ముడతలు ఉంటే, అరటిపండు పేస్ట్‌లో 1 టీస్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. నల్లటి మచ్చల గురించి ఆందోళన చెందుతుంటే, 1 టీస్పూన్ పసుపు లేదా కలబంద జెల్‌ను కలుపుకోవాలి. చర్మం పొడిగా ఉంటే, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలపాలి.
అరటిపండు ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి?
అరటిపండు ఫేస్ ప్యాక్ కోసం బాగా పండిన అరటి పండు తీసుకొని దాని తొక్క తీసి శుభ్రమైన గిన్నెలో వేసుకొని మొత్తగా పిసకాలి. చర్మ అవసరాలకు అనుగుణంగా తేనె , ఇతర పదార్థాలను వేసి బాగా కలపాలి. అది పేస్ట్ లా మారిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని.. ముఖంపై అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్‌ని దాదాపు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, కాసేపు ఆరబెట్టుకోవాలి. చివరగా, తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా కలబంద జెల్ రాయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
అరటిపండుతో ఇలా…
- Advertisement -
- Advertisement -



