Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ నడిబొడ్డున నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలి

గ్రామ నడిబొడ్డున నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట్ గ్రామ నడిబొడ్డున ఉన్న మద్యం దుకాణాన్ని గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం రోజు గోపాలపేట గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో గ్రామ నడిబొడ్డున మద్యం దుకాణం ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కన నివాసపు ఇల్లు ఉండేవి కావు ప్రస్తుతం సుభాష్ చంద్రబోస్ వీధిలో నివాసపు ఇండ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా మహిళలు ఆ దారి వెంట నడవాలంటే తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని వారు పేర్కొన్నారు. గ్రామానికి దూరంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. వైన్స్లో మందు కొట్టి మద్యం ప్రియులు చుట్టుపక్కల మూత్ర విసర్జన చేయడం, అధికంగా మందు సేవించి రోడ్ల వెంట నిద్రపోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. టెండర్ కాకముందు గ్రామస్తులంతా జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తిరిగి ఈరోజు ప్రజావానిలో తాసిల్దార్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫరీద్, మచ్చేందర్, రవి, దుర్గేష్ ,రాజు, గోపాల్, గణేష్ తదితరులున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -