Tuesday, October 7, 2025
E-PAPER
Homeదర్వాజసాహిత్య స‌మాచారం

సాహిత్య స‌మాచారం

- Advertisement -

25న ‘తలపుల పుటలు’ ఆవిష్కరణ
కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో ఈ నెల 25న సాయంత్రం బూర్ల వెంకటేశ్వర్లు కవితా సంపుటి ‘తలపుల పుటలు’ ఆవిష్కరణ జరుగబోతున్నది. సభకు సి.వి.కుమార్‌, అన్నవరం దేవేందర్‌, నగునూరి శేఖర్‌, తోట నిర్మలారాణి, కొండి మల్లారెడ్డి, కల్వకుంట్ల రామకష్ణ, కందుకూరి అంజయ్య తదితరులు పాల్గొంటారు.
– సి. వి. కుమార్‌, తెరవే కరీంనగర్‌

‘దాపు’ కవితా సంపుటి ఆవిష్కరణ
మునాసు వెంకట్‌ ‘దాపు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఆగస్టు 31, ఉదయం 10 గంటలకు నల్లగొండలో తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాసంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, గోరటి వెంకన్న, బెల్లి యాదయ్య, అంబటి సురేంద్ర రాజు, గుంటూరు లక్ష్మీ నరసయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కష్ణ కౌండిన్య, కవి సిద్ధార్థ, భానుశ్రీ కోత్వాల్‌, ఎస్‌ రఘు, పెరుమాళ్ళ ఆనంద్‌, బైరెడ్డి కష్ణారెడ్డి, అంబటి వెంకన్న తదితరులు పాల్గొంటారు.
– సజన సాహితి, నల్లగొండ

‘సాక్ష్యం’ కవితాసంపుటి ఆవిష్కరణ

ఆగస్టు 31 వ తారీఖున హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఉదయం 10 గంటలకి దొంతం చరణ్‌ ‘సాక్ష్యం’ కవిత్వ సంపుటి ఆవిష్కరణ. ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌, శ్రీరాం పుప్పాల, లావణ్య తీగల పాల్గొంటారు.
– ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ ప్రచురణ

రా.ర.వే 127 వ సమావేశం

ఆగష్టు 31 వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో గల శ్రీ విద్యానికేతన్‌ స్కూల్లో ‘రాజాం రచయితల వేదిక’ 127 వ సమావేశం జరుగుతుంది. పొదిలాపు శ్రీనివాసు అధ్యక్షతన జరిగే, ఈ సభలో ‘శిఖామణి దళిత కవిత్వం-ఒక పరిశీలన’ అంశంపై ఉత్తరాంధ్ర సాహిత్య విమర్శకులు ‘పిల్లా తిరుపతిరావు’ ప్రసంగిస్తారు. – గార రంగనాథం, 9885758123

జాతీయ బాలచెలిమి కథల పోటీ – 2025
చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ చైర్మన్‌, బాలచెలిమి సంపాదకులు శ్రీ మణికొండ వేదకుమార్‌ గారి సారథ్యంలో, బాలల దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో బాలచెలిమి కథల పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలకోసం, పిల్లలు రాసిన కథలు, పిల్లల కోసం పెద్దలు రాసిన కథలు విడివిడిగా పంపాలి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాలు – నివారణ, మానవతా నైతికవిలువలు, దుర్వ్యసనాలకు దూరం వంటి అంశాలకు ప్రాధాన్యం. మూఢనమ్మకాలను ప్రేరేపించేవి ఉండకూడదు, శాస్త్రసాంకేతికాలకు అవకాశం. చేతిరాతలో మూడు, టైపులో 2 పేజీలకు మించని కథలను సెప్టెంబర్‌, 20 లోపుజు mail: edit.chelimi@gmail.com.. కి, లేదా బాల చెలిమి ‘ కథల పోటీ’, ‘భూపతి సదన్‌’, ఇ. నం: 3-6-716, స్ట్రీట్‌ నం: 12, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌ -500029, తెలంగాణ.చిరునామాకు పంపాలి. వివరాలకు: 8686664949, 9030626288
– గరిపెల్లి అశోక్‌, 9849649101

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -