Monday, October 27, 2025
E-PAPER
Homeదర్వాజసాహితీ సమాచారం

సాహితీ సమాచారం

- Advertisement -

అమృతలత, అపురూప అవార్డులు
‘అమృతలత జీవన సాఫల్య పురస్కారం, ‘ఇందూరు అపురూప అవార్డ్స్‌’ 2024-25 ప్రదానోత్సవం నవంబర్‌ 2 ఉదయం 10.30 గంటలకు నిజామాబాదు మామిడిపల్లి లోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డా.సి.మృణాళిని, వి.ప్రతిమ, నెల్లుట్ల రమాదేవి హాజరవుతారు. ‘అమృతలత జీవన సాఫల్య’ పురస్కారాలను 2024వ సంవత్సరానికిగాను కథ, నవల విభాగంలో వసుంధర, డా. శాంతి నారాయణ, జర్నలిజం విభాగంలో జి. వల్లీశ్వర్‌, 2025వ సంవత్సరానికి అనువాదం విభాగంలో డా. నలిమెల భాస్కర్‌, కవిత్వం విభాగంలో జి. వెంకట కృష్ణ, కథ/ నవల విభాగంలో డా. పెద్దింటి అశోక్‌ కుమార్‌ ఎంపికయ్యారు.

నిజామాబాదు జిల్లాకు సంబంధించిన సాహితీవేత్తలకు, వివిధ రంగాలకు చెందిన కళాకారులకు ప్రతిరెండేళ్ళకు ఓసారి ప్రదానం చేసే ‘ఇందూరు అపురూప అవార్డ్స్‌’కి ఎంపికైన వారు. 2024వ సంవత్సరానికిగాను సూరారం శంకర్‌ (గజల్‌), పంచరెడ్డి లక్ష్మణ్‌ (కవిత్వం), స్వయం ప్రకాశ్‌ (సంపాదకత్వం), ఎన్‌. విజయాకిషన్‌ రెడ్డి (కవిత్వం), కుసుమలతా రెడ్డి (పర్యావరణ పరిరక్షణ), 2025వ సంవత్సరానికిగాను వసంతా వివేక్‌ (బహుముఖ ప్రజ్ఞ), వి. నర్సింహారెడ్డి (ఆధ్యాత్మిక సాహిత్యం), పి.సుజాత (బోధనా రంగం), సుమీలా శర్మ (క్రీడలు / నాట్యం), డా. బోచ్కర్‌ ఓంప్రకాశ్‌ (అవధానం) విభాగాలలో అందుకుంటున్నారు. సాహితీ కళాభిమానులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వివరాలకు 98488 68068, 9848868067

సాహితీ కిరణం కథల పోటీలు
సాహితీకిరణం మాసపత్రిక వివిధ సంస్థల సౌజన్యంతో విడదల నీహారికా ఫౌండేషన్‌ సంక్రాంతి కథలపోటీ 2026, ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్‌ చిన్నకథలపోటీ -2025 కథల పోటీలు నిర్వహిస్తున్నది. కథ ఎ4 సైజూ పేపర్‌లో 6 పేజీలు, చిన్న కథ 2 పేజీలు వుండాలి. కథలు ‘సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌ నెం.3, హైదరాబాద్‌-500102’ చిరునామాకు నవంబర్‌ 30 లోపు చేరాలి. వివరాలకు సంప్రదించవలసిన నెంబర్‌:9490751681

దళిత కవితా సంపుటుల పరిచయం
అంబేద్కర్‌ విద్యార్థి సంఘం, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో కేశవ కుమార్‌ గారి ‘ఆదిమ పౌరుడు’, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూని రాగం’ అనే ఈ రెండు కవితా సంపుటాల పరిచయ సభ ఈ రోజు సాయంత్రం 5 గం.లకు అంబేద్కర్‌ ఆడిటోరియం హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. ప్రొఫెసర్‌ బి.ఈశ్వర రావు, ప్రజాకవి గోరేటి వెంకన్న, సతీష్‌ చందర్‌, పిల్లలమర్రి రాములు, కందుకూరి అంజయ్య, మెర్సీ మార్గరెట్‌, పసునూరి రవీందర్‌, ప్రొఫెసర్‌ కె.వై రత్నం, ప్రొఫెసర్‌ శేషు బాబు పుస్తకాలను పరిచయం చేస్తారు. ఏ.రవీంద్రబాబు ఆప్త వచనం పలుకుతారు. వివరాలకు : తాటిపెల్లి తిరుపతి, అంబేద్కర్‌ విద్యార్థి సంఘం, 8498939258 ను సంప్రదించండి.

కవిత్వ సంపుటాలకు ఆహ్వానం
వట్టికోట ఆళ్వారు స్వామి సాహిత్య కళా పీఠం వారు తుల యాదయ్య స్మారక జాతీయ పురస్కారం 2025 కొరకు కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన ఒకరికి జీవన సాఫల్య పురస్కారం, 2024లో ప్రచురింపబడిన యువ కవుల కవిత్వ సంపుటాలను రెండు కేటగిరీలలో పరిగణలోకి తీసుకోబడును. నాలుగు కవిత్వ సంపుటాలు డిసెంబర్‌ 31 లోపు ‘తుల శ్రీనివాస్‌ ఇం.నెం: 12-107/A, సంతోష్‌ నగర్‌, నకిరేకల్‌, నల్లగొండ, తెలంగాణ. 508 211’ చిరునామాకు పంపాలి. వివరాలకు :99485 25853,63001 13522

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -