‘కలల సందుక’ ఆవిష్కరణ సభ
దివంగత డా.మండల స్వామి రచించిన ‘కలల సందుక’ కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 11న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, రవీంద్ర భారతిలో ఉంటుంది. ఏనుగు నరసింహారెడ్డి, నాళేశ్వరం శంకరం, నామోజు బాలాచారి, తండు కృష్ణ కౌండిన్య, వేముగంటి మురళీ కృష్ణ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, సాగర్ల సత్తయ్య, ఉప్పల పద్మ, కనకటి రామకృష్ణ, గడ్డం శ్రీను, బండారు శంకర్ పాల్గొంటారు. –పెరుమాళ్ళ ఆనంద్
ఒద్దిరాజు సోదర కవుల స్మారక సాహితీ పురస్కారం 2025
ఒద్దిరాజు సోదర కవుల స్మారక సాహితీ పురస్కారం 2025 ముంబైకి చెందిన అంబల్ల జనార్ధన్ ‘ముంబై చూపుతో’ తెలుగు కథానికల సంపుటికి లభించింది. నవంబరు15న హనుమకొండలో జరిగే వార్షికోత్సవంలో రు10,000 నగదుతో ఈ పురస్కారం అందజేస్తారు. –గన్నమరాజు గిరిజామనోహర బాబు
‘సాహిత్యవారం’
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి నెలా ఒకటవ మరియు మూడవ శనివారాల్లో నిర్వహిస్తోన్న ‘సాహిత్యవారం’ కార్యక్రమంలో భాగంగా ఈనె 15న సాయంత్రం 5.00 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో సుప్రసిద్ధ కథా రచయిత డా. కాలువ మల్లయ్య రచించిన తెలంగాణ దేశీ భాష సాహిత్య ‘గంప’, Book of Culture (ఆంగ్లం) పుస్తకాల ఆవిష్కరణ వుంటుంది. ప్రొ.పులికొండ సుబ్బాచారి, ఆచార్య టి. గౌరీశంకర్, ప్రొ. బాణాల భుజంగరెడ్డి పాల్గొంటారు. సాహితీ మిత్రులందరికీ ఆహ్వానం. –డా.నామోజు బాలాచారి
‘మట్టి పువ్వు’ పుస్తకావిష్కరణ
ఈనెల 16న సాయంత్రం ఖమ్మం లోని జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో ఎన్.తిర్మల్ రచించిన ‘మట్టి పువ్వు’ పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని ‘ప్రజా సంస్కతి’ ద్వెమాసిక సాహిత్య పత్రిక ఎడిటర్ ఎన్.అరుణ తెలియజేశారు. ఈ సభకు ప్రముఖ కథా రచయిత సయ్యద్ హనీఫ్, ప్రొ.జయదీర్ తిరుమల రావు, జూలూరి గౌరీశంకర్, జీవన్, మువ్వా శ్రీనివాసరావు, పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు, అవునూరి మధు, కపిల్ రాంకుమార్, లెనిన్ శ్రీనివాస్, స్వర్ణ సుబ్బారావు, సిహెచ్ ఆంజనేయులు పాల్గొంటారు. సాహిత్య అభిమానులందరికీ ఆహ్వానం.
‘నాగలి తరం’ ఆవిష్కరణ సభ
నందిని సిధారెడ్డి నవల ‘నాగటితరం’ ఆవిష్కరణ సభ ఈ నెల 16న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా బందారంలో జరుగుతుంది. మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో నర్ర భగవాన్ రెడ్డి, బైస దేవదాసు, వాసిరెడ్డి నవీన్, నాళేశ్వరం శంకరం, దేవీప్రసాద్, దేశపతి శ్రీనివాస్, విరాహత్ అలీ, నక్క యాదవరెడ్డి, కందుకూరి శ్రీరాములు, టేకులపల్లి గోపాల్‌రెడ్డి, కొమురవెల్లి అంజయ్య, సిహెచ్.బాల్ నర్సయ్య, కె.రంగాచారి, ఎన్.మల్లారెడ్డి, సిద్దెంకి గిరి పాల్గొంటారు.
అక్షరాల తోవ పురస్కారం – 2026
అక్షరాల తోవ 8వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాల తోవ పురస్కారం – 2026కు రచనలకు ఆహ్వానం పలుకుతోంది. ఏదైనా సామాజికాంశంతో స్వంత రచనలు ఎ4 సైజులో టైప్ చేసి పంపాలి. ఇతర సంస్థల వద్ద బహుమతులు పొందిన రచనలను స్వీకరించబడవు. రచనలను నవంబర్ 30లోపు ‘రాచమళ్ళ ఉపేందర్, స్టార్ ఆఫ్ సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జి ఎదురుగ, స్టేషనరోడ్ ఖమ్మం – 507001’ చిరునామాకు పంపాలి. వివరాలకు : నామ పురుషోత్తం- 986664521.
సాహితీ సమాచారం
- Advertisement -
- Advertisement -

