నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి కార్యక్రమం
ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్, రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ సాహిత్యఅకాడమీ అలిశెట్టి ప్రభాకర్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి జూపల్లి కష్ణారావు, డా. బాలాచారి, ప్రొ|| కోదండరాం, ప్రొ|| జయధీర్ తిరుమలరావు, పాశం యాదగిరి, డా|| నరసింహారెడ్డి, డా||నాళేశ్వరం, బద్రీ నర్సన్ పాల్గొంటారు. యువకవుల కవి సమ్మేళనం ఉంటుంది. అందరూ ఆహ్వానితులే.
– కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ
చెమన్ కు 12 న అలిశెట్టి పురస్కార ప్రదానం
తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్యర్యంలో యిస్తున్న అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారానికి ఈ ఏడాది డా|| చెమన్ ఎంపికయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ ఫిలిమ్ భవన్‌లో పురస్కార ప్రదాన సభ జరుగుతుంది. – సి.వి.కుమార్
వచన కవితా సంపుటాలకు ఆహ్వానం
‘వెన్నెల సాహితీ పురస్కారం-2025’ కొరకు 2024,2025లలో ప్రచురించిన కవితా సంపుటాలు నాలుగు ప్రతులను, ఫిబ్రవరి 28 లోపు ‘పర్కపెల్లి యాదగిరి, ఇం.నెం.17-3-86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్-2, రంగధాంపల్లి చౌరస్తా దగ్గర, సిద్ధిపేట- 502103’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 9299909516,9848261284.
– పర్కపెల్లి యాదగిరి, వెన్నెల సాహితీ సంగమం.
డా|| రాణీ పులోమజాదేవి కథా పురస్కారం -2026
తెలుగు సాహితీవనం ఆధ్వర్యంలో డా|| రాణీ పులోమజాదేవి కథా పురస్కారం 2026కి సంపుటాలను ఆహ్వానిస్తున్నది. 2024-25లో ప్రచురించిన కథాసంపుటాల రెండు కాపీలను ఫిబ్రవరి 10 లోపు ‘డా|| తిక్కా సత్యమూర్తి, ప్లాట్ నెం: డి42, ఫ్లాట్ నెం-504, సాయి లక్ష్మిఎన్‌క్లేవ్, మధురానగర్, హైదరాబాద్ -500038’కు పంపాలి. వివరాలకు:9849344109. – శాంతికృష్ణ,
కొలకలూరి పురస్కారాలు – 2026
కొలకలూరి సాహిత్య పురస్కారాలు 2026కు గాను 1. కొలకలూరి భాగీరథీ కథనిక పురస్కారం, 2. కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం, 3. కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం అనే మూడు ప్రక్రియా గ్రంథలకు పురస్కారాలు ప్రకటించారు. ఆయా ప్రక్రియల్లో 2024 జనవరి 1 తర్వాత ప్రచురితమైన గ్రంథలు నాలుగేసి ప్రతులను జనవరి 15 లోగా పంపాలి. గ్రంథలు పంపవలసిన చిరునామాలు: కథనిక, నవలలకు:ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (94419 23172) (పూర్వ ఉపాధ్యక్షలు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం), తెలుగు శాఖాధ్యక్షలు, పరీక్ష విభాగం డీన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి – 517502. ఆం.ప్ర. విమర్శన గ్రంథలకు : ఆచార్య కొలకలూరి సుమకిరణ్ (99635 64664), ఆంగ్లాచార్యులు, అధ్యక్షలు, బోర్డ్ ఆఫ్ స్టడీస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి – 517 502. ఆం.ప్ర.
పీచర సునీతారావు 2025 సాహిత్య పురస్కారాలు
స్వర్గీయ పీచర సునీతారావు పేరుతో ఐదవ వార్షిక పురస్కారాల కోసం కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహితీ విభాగాలకు సంపుటులను అహ్వానిస్తున్నది. మార్చ్ 2022 నుండి డిసెంబర్ 2025 వరకు వెలువడిన రచనల మూడు కాపీలు ఫిబ్రవరి 25లోపు పంపించాలి. చిరునామా: పీచర సునీతారావు ఫౌండేషన్, కేర్ ఆఫ్ విజయేందర్ రావు, ప్లాట్ నెం: 505, బ్లాక్ డి .భీమాప్రైడ్ అపార్ట్ మెంట్స్, నియర్ సుచిత్ర సర్కిల్, జీడిమెట్ల, హైదరాబాద్ -67. వివరాలకు: 9866043441, 9848698699. – కాంచనపల్లి గోవర్ధన్ రాజు, 9676096614, అవార్డ్ కమిటీ కన్వీనర్.
సాహితీ వార్తలు
- Advertisement -
- Advertisement -



