Sunday, March 22, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

రెండో తెలుగు లిటరరీ కాంగ్రెస్‌-2026
ఈ నెల 9, 10 న రూమ్‌ నెంబర్‌ 133, ఆర్ట్స్‌ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండు రోజులపాటు రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్‌ జరగబోతోంది. డిజిటల్‌ యుగంలో యువరచయితల సాహిత్య సృజన కేంద్రంగా జరగబోతున్న ఈ కాంగ్రెస్‌లో మొత్తం పది సెషన్లు ఉంటాయి. దాదాపు 55 మంది యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు పాల్గొంటారు. ఈ రెండు రోజులూ ఆర్ట్స్‌ కళాశాల ముందు బహిరంగ ఆవరణలో కవితా దునియా, కవిత జిందగీ పేర్లతో కవితా పఠనం, గాన/ కళా ప్రదర్శనలు జరుగుతాయి. దీంట్లో దాదాపు 40 మంది యువ కవిగాయకులు, జానపద వృత్తికళా ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ రెండవ కాంగ్రెస్‌కు డైరెక్టర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్‌ చింతకింది కాశీం, కన్వీనర్‌గా తెలుగుశాఖ అధ్యక్షులు, ఆచార్య సాగి కమలాకర శర్మ వ్యవహరిస్తారు.

‘కళింగ సాహిత్య పాఠశాల’ ప్రారంభ సమావేశం
‘ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మొదటి సమావేశం ఫిబ్రవరి 11 ఉదయం డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ యూనివర్సిటీ శ్రీకాకుళం, ఎచ్చెర్ల జర్నలిజం శాఖ తరగతిగదిలో ప్రారంభమౌతుంది. ఈ సభలో ‘కళింగ సాహిత్యం-దశ దిశ’ అంశంపై కథానవలా రచయిత అట్టాడ అప్పలనాయుడు తెలుగు, ఆంగ్లం, జర్నలిజం విద్యార్థులతో మాట్లాడుతారు. ఇంకా ఈ సభలో డా.జి. లీలావరప్రసాద్‌ గారు, డా.కె.ఉదయ్ కిరణ్‌ గారు పాల్గొంటారు. -బాలసుధాకర్‌, ఎరిక (కళింగ సాహిత్య పాఠశాల)

నందిని సిధారెడ్డి సాహిత్యంపై అంతర్జాతీయ సదస్సు
”డాక్టర్‌ నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన’ అనే అంశంపై, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, ఘట్కేసర్‌లో ఫిబ్రవరి 12, 13 తేదీలలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సభలో డాక్టర్‌ పి.స్నేహలత, ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌, ఆచార్య సి. కాశీం, ఆచార్య సాగి కమలాకరశర్మ, ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలాచారి నాళేశ్వరం శంకరం, కోయికోటేశ్వరరావు, కొండా నాగేశ్వర్‌, దేశపతి శ్రీనివాస్‌ పాల్గొంటారు. సదస్సు పత్రాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక ఆవిష్కరించబడుతుంది.
-డాక్టర్‌ శ్రీభాష్యం అనురాధ, సదస్సు కన్వీనర్‌
-డాక్టర్‌ పి. స్నేహలత, సదస్సు అధ్యక్షులు

తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌ -2026
ఈ నెల 21,22 తేదీల్లో తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌ -2026ను ఏవి కళాశాల, హైదరాబాద్‌ నందు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా దశాబ్ది సాహిత్య సంచిక తీసుకువస్తున్నాము. ఈ ఫెస్ట్‌లో కవిత్వం, కథ, నవల, పాట, విమర్శ, మహిళా, యువ సాహిత్యాలపై చర్చలుంటాయి. పుస్తకావిష్కరణలు, పుస్తకప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్‌, నాటక ప్రదర్శనలు ఉంటాయి.
వల్లభాపురం జనార్థన, కె.ఆనందాచారి- 9948787660, 8897765417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -