- Advertisement -
23న గస్సాల్ మరి కొన్ని కథలు ఆవిష్కరణ సభ
కె. ఆనందాచారి కథల సంపుటి గస్సాల్ మరి కొన్ని కథలు ఆవిష్కరణ సభ రవీంద్ర భారతిలో 23-05-25 (శుక్రవారం) సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సభలో పెద్దింటి అశోక్ కుమార్, డా. ఏనుగు నర్సింహారెడ్డి, మామిడి హరికష్ణ, వేముల శ్రీనివాస్, ప్రసేన్, డా.నామోజు బాలాచారి, మువ్వా శ్రీనివాసరావు, ఆర్.సీతారాం, వల్లాభాపురం జనార్ధన, నస్రీన్ ఖాన్, చరణ్ పరిమి, సాయి వంశీ, తంగిరాల చక్రవర్తి పాల్గొంటారు.
- తెలంగాణ సాహితి
అన్నవరం దేవేందర్ ‘కవి సంధి’ కార్యక్రమం
మే 25 వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు కరీంనగర్, ఫిల్మ్ భవన్ ఏసి హాల్‌లో అన్నవరం దేవేందర్ ‘కవి సంధి’ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తన సాహిత్య జీవన యాత్రను అన్నవరం దేవేందర్ వివరించి కవితా పఠనం చేస్తారు. అనంతరం ప్రశ్నలు సమాధానాల సెషన్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులు ప్రసేన్ పర్యవేక్షిస్తారు.
డా|| సి మణాళిని, కన్వీనర్, తెలుగు సలహా మండలి
ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాలకోసం ఆహ్వానం
ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాలకోసం కవిత సంపుటులకు, కథలకు ఆహ్వానం. మూడు ఉత్తమ కధలకు, కవితా సంపుటి విజేతలకు నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రం, ప్రత్యేక సత్కారం ఉంటుంది. కవితా సంపుటి 2024 ఏప్రిల్, 2025 మార్చ్ నడుమ ప్రచురితమై కనీసం 25 కవితలకు తగ్గకుండా సంపుటి ఉండాలి. కథలు, కవితా సంపుటి నాలుగు ప్రతులను పోస్ట్‌లో, యూనికోడ్ సాఫ్ట్ కాపీని మెయిల్‌కి పంపాలి. బహుమతి పొందిన కథలతో పాటు మరో తొమ్మిది కథలను సాధారణ ప్రచురణకు స్వీకరించి సంకలనంగా ప్రచురించడం జరుగుతుంది. - రవి మారుత్
- Advertisement -