Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వర్షాభావ పరిస్థితుల నుండి పశువులను కాపాడుకోవాలి 

వర్షాభావ పరిస్థితుల నుండి పశువులను కాపాడుకోవాలి 

- Advertisement -

పశు వైద్యాధికారి అశోక్ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

వర్షాభావ పరిస్థితుల నుండి పశువులను, గేదెలను, మేకలను, గొర్రెలను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి దేవిరెడ్డి అశోక్ రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. పశువుల సంరక్షణ కోసం ఎత్తైన ప్రదేశాల్లో సురక్షితమైన షెల్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శుభ్రమైన త్రాగునీరు, శుభ్రమైన మేత అందించాలని సూచించారు. నష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పశువులను, పాడి గేదెలను, గొర్రెలు, మేకలను మేత కోసం తీసుకువెళ్లరాదని సూచించారు. వరదల ఉధృతిని దృష్టిలో పెట్టుకొని దాటేందుకు సాహసం చేయకూడదని తెలిపారు.

వర్షభావ పరిస్థితులతో ఉరుములు, మెరుపులను దృష్టిలో పెట్టుకొని పశువులను చెట్ల వద్ద కట్టి వేయరాదని సూచించారు. పిడుగుపాటుకు పశువులు గురైతే పశు వైద్యాధికారులకు సమాచారాన్ని అందించాలన్నారు. పశువులతో పాటు మనుషులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోరాదని తెలిపారు. విద్యుత్ స్తంభాలకు, తీగలకు పశువులతో పాటు గొర్రెలు, మేకలు, పాడి గేదెలు దూరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి వనరులకు దూరంగా ఉండాలన్నారు. పశువులు గుంపులు గుంపులుగా కాకుండా విడివిడిగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పిడుగుపాటు సహజ ఉత్పత్తి అని పిడుగుపాటు నుండి తప్పించుకోవడం కష్టతరమన్నారు. పిడుగుపాటు నుండి జాగ్రత్తలు తీసుకొని నష్టాన్ని నివారించుకోవాలని రైతులకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad