Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

- Advertisement -

నవతెలంగాణ- తుంగతుర్తి
పాడి రైతులు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తుంగతుర్తి మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఎ.నరేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి,వెంపటి గ్రామాలలో పశువైద్య,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు 28 పశువులకు,105 గేదెలకు మొత్తం 133 పాడి జంతువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఏ రాజశేఖర్,వెటర్నరీ అసిస్టెంట్ రవి,ఓఎస్ నాగరాజు, గోపాలమిత్రలు కుంచాల శ్రీనివాస్ రెడ్డి,లింగయ్య,శ్రీను తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -