డాక్టర్ శివరాజ్
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామాలలో ఉన్న రైతులు మూడు నెలలు దాటిన పశువులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్య డాక్టర్ శివరాజ్ అన్నారు. గురువారం మండలంలోని వల్లభరావు పల్లి, బోయినపల్లి , బైరంపల్లి, గ్రామాలలో ఉచిత గాలికుంటు శిబిరాలు పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మూగజీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేస్తున్న నిర్వహిస్తున్న గాలికుంటు నివారణ ఉచిత టీకాలు రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 325 పశువులకు ఉచిత టీకాలు వేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నర్సింలు, శ్రీనివాస్, గోపాలమిత్రలు యాదగిరి,నరసింహ, వేణుగోపాల్, మల్లేష్, రామకృష్ణ , రైతులు తదితరులు పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES