Thursday, November 20, 2025
E-PAPER
Homeజిల్లాలుతక్కువ వడ్డీతో రుణాలు..

తక్కువ వడ్డీతో రుణాలు..

- Advertisement -

డిసిసి బ్యాంకు మేనేజర్ రమేష్..
నవతెలంగాణ – చిన్నకోడూరు
తక్కువ వడ్డీతో రుణాలు పొంది మీ వ్యాపా రాలను చేసుకుని అధిక లాభాలు పొందవచ్చని డిసిసి బ్యాంక్ మేనేజర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన చిన్నకోడూరులోని అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ సదానందం, మేనేజర్ రమేష్ లు మాట్లాడుతూ  జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేస్తే అన్ని బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీని పొందవచ్చని సూచించారు. సహకార వారోత్సవాలలో భాగంగా బ్యాంకు లో నూతనంగా “స్వర్ణనిది డిపాజిట్” డిపాజిట్ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

ఈ పతకం ద్వారా 444  రోజులకు  అత్యధికంగా 8.25  శాతం వడ్డీని పొందవచ్చన్నారు. డిపాజిట్ల ఫై  ఇన్సురెన్స్ సదుపాయం ఉందన్నారు. కస్టమర్లకు ఎటిఎం,యూపీఐ ,మొబైల్ బ్యాంకింగ్ ,బ్యాంకు గ్యారంటీ  లాకర్ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. అతి తక్కువ వడ్డీకి గృహ రుణాలు ,వ్యాపార రుణాలు ,స్వల్పకాలిక రుణాలు  దీర్ఘకాళికా రుణాలు ఇస్తున్నామని తెలిపారు. బంగారు ఆభరణాలపై అతితక్కువ వడ్డీకి అత్యధికంగా గ్రాము కి 7400 /- రుణాన్ని అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -