- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గం మండలంలోని చిన్నతూండ్ల గ్రామానికి చెందిన బొబ్బిలి రామయ్య ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును కుటుంబ విన్నవించారు. ఈ నేపథ్యంలో బాధితుడు వైద్య ఖర్చుల కోసం రూ.2.50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి మంత్రి సహాయకులతో ఇప్పించారు. అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబుకు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



