- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామానికి చెందిన జాగర్ల ఉసేంద్ర కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించారు. స్పందించిన ఆయన ఉసేంద్ర వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసి మంజూరు పత్రాన్ని శనివారం బాధితుడికి అందజేశారు.ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు బాధితుడికి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -