– విజయం సాధించిన సర్పంచులు వీరే
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఉప్లూర్ సర్పంచ్ గా ఎనుగందుల శైలేందర్ (కాంగ్రెస్), నాగపూర్ సర్పంచ్ గా కప్పదండి అశోక్ (కాంగ్రెస్), రాజరాజేశ్వరి నగర్ సర్పంచ్ గా తైద సుశీల సాయన్న (టిఆర్ఎస్), కమ్మర్ పల్లి సర్పంచ్ గా కొత్తపల్లి హారిక అశోక్ (టిఆర్ఎస్), హాస కొత్తూర్ సర్పంచ్ గా రేణి గంగాధర్ (కాంగ్రెస్), బషీరాబాద్ సర్పంచ్ గా బైకాన్ జమున మహేష్ (టిఆర్ఎస్), కోన సముందర్ సర్పంచ్ గా బెజ్జారం రాకేష్ (టిఆర్ఎస్), నర్సాపూర్ సర్పంచ్ గా బుసపురం సంధ్య రాజశేఖర్ (టిఆర్ఎస్), ఇనాయత్ నగర్ సర్పంచ్ గా బాణావత్ లలితా రాములు (కాంగ్రెస్), కొత్తచెరువు తండా సర్పంచ్ గా లకావత్ సంతోష్ (కాంగ్రెస్), అమీర్ నగర్ సర్పంచ్ గా ఊరే నీలవేణి (ఇండిపెండెంట్), చౌట్ పల్లి సర్పంచ్ గా మహబూబ్ (టిఆర్ఎస్), కోనాపూర్ సర్పంచ్ గా తిప్పి రెడ్డి ప్రభాకర్ (కాంగ్రెస్) విజయం సాధించారు.
ఇంతకుముందే దొమ్మరి చౌడు తండా సర్పంచ్ గా గూగులావత్ మంజుల (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా 13 గ్రామపంచాయతీలో ఆరు పంచాయతీలను టిఆర్ఎస్, ఏడు పంచాయతీలను కాంగ్రెస్ పార్టీలో గెలుచుకోగా ఒక గ్రామపంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నుకున్న ఉపసర్పంచ్ లకు ప్రెసిండింగ్ అధికారులు నియామక పత్రాలు అందజేశారు. గెలుపొందిన అభ్యర్థులు గ్రామాల్లో అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.



