వర్షపు నీరు పోయేందుకు సైట్ డ్రెన్ లు నిర్మించని గుత్తేదారుడు..
నవతెలంగాణ – జుక్కల్
ఇట్టకేలకు లొంగన్ నుండి కంఠాలి వరకు మధ్య మార్గం బీటీ రోడ్డు ఇటీవలే మాసంలో పూర్తి చేయడం జరిగింది. వివరాలోకి వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుల్లా పి డబ్ల్యు డి బీటీ రోడ్డు నుండి జుక్కల్ పీడబ్ల్యుడి రోడ్డు వరకు వయా కంఠాలి నుండి లొంగన్ వరకు 6.50 కి.మీటరు బీటి రోడ్డు మాజీ ఎంపీ బిబి పాటిల్ సహకారంతో పనులను ప్రారంభించారు. సదరు గుత్తే దారుడు రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జుక్కల్ రెండు వరుసల ఆర్ అండ్ బి పెద్ద రోడ్డు నుండి లొంగన్ వరకు బీటీ రోడ్డు వేసి వదిలేశాడు.
లొంగన్ గ్రామం నుండి పెద్దగుల్లా పిడబ్ల్యుడి రోడ్ వరకు రోడ్డు వేయకుండానే రోడ్ అంతా తవ్వేసి వదిలేశాడు. నాటినుండి బీటీ రోడ్డు వేయక పోవడంతో మార్గమధ్యం రోడ్డు అసంపూర్తిగా నిలిచి పోయింది. దీంతో ఈ దారిగుండా వెళ్లే వాహనదారులకు నానా ఇబ్బందులు పడ్డారు. గుత్తేదారుడు కల్వర్టు నిర్మాణం చేశారు. కానీ పర్వత ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం కొరకు బీటీ రోడ్డు వేసినా పక్కనే గుట్టలు ఉండడంతో వర్షం పడినప్పుడు నీరు భారీగా వస్తుంది. నీరు పోవడానికి కాలువలను నిర్మాణం చేయకపోవడంతో ఇటీవల పడిన వర్షానికి రోడ్డు పై భాగం నుండి నీరు ప్రవహించింది. ఈ నీళ్ల ధాటికి కొత్త రోడ్డు కూడా కొట్టుకుపోయే పమాదం ఉంది. ఇటీవల చేసినా రోడ్డు కూడా నాణ్యత లోపంతో వేసినారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
కంఠాలి తాండా, కంఠాలి గ్రామం సంబంధించిన కొంతమంది యువకులు పంచాయతీరాజ్ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పి ఆర్ అధికారులు సైడ్ డ్రైన్ కాలువ నిర్మాణం కొరకు సదరు గుత్తేదారుడిని వివరణ తీసుకొని, బీటి రోడ్డు సైడ్ డ్రైన్ మీరు లొంగన్ చెరువులో కలిసే విధంగా కాలువ నిర్మాణం చేయించాలని గ్రామస్తులు అంటున్నారు. వేసిన కొత్త రోడ్డు మున్నాళ్ల ముచ్చటగానే ఉండిపోతుందని, వెంటనే పనులు ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
లొంగన్ – కంఠాలి బీటీ రోడ్డు పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES