నవతెలంగాణ – కంఠేశ్వర్ : సాయిబాబా ఆలయంలో దోపిడి దొంగలు అర్ధరాత్రి సమయంలో హల్చల్ చేసి దేవుని విగ్రహం, వెండి కిరీటం సహా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని 17వ డివిజన్ రాజీవ్ నగర్‌లో హనుమాన్ టెంపుల్ సమీపంలో ఉన్న సాయిబాబా ఆలయంలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో సమాచారం ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి ఆలయంలోకి చొరబడి సుమారు 30 తులాల వెండి కిరీటము, నాలుగు కిలోల ఇత్తడి సాయిబాబా విగ్రహం, రెండు పెద్ద చెమ్మాయిలు, ఐదు రాగి చెంబులు, మంగళహారతుల సామగ్రి సహా మరికొన్ని విలువైన వస్తువులను అపహరించారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు తలుపులు తెరిచి ఈ విషయం గమనించి వెంటనే పట్టణ 3వ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సాయిబాబా ఆలయంలో దోపిడి దొంగల హల్ చల్ ..
- Advertisement -
- Advertisement -



