Friday, November 21, 2025
E-PAPER
Homeకరీంనగర్కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉండాలి

కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉండాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
తంగళ్ళపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పరిశీలన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలంలోని తాడూర్, పాపయ్యపల్లి, ఓబులాపూర్, సారంపల్లి, రాళ్లపేట, కస్బేకట్కూర్, చీర్లవంచ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ముందుగా ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం  కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ధాన్యం తేమ శాతం, కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కనీస వసతులు కల్పించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులను ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు కేంద్రాలకు లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -