- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
టైర్ పగిలి నిప్పురవ్వలు పడి లారీ దగ్ధమైన ఘటన వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుండి తౌడు లోడుతో తమిళనాడు వెలుతుండగా మండలంలోని అక్కంపల్లి సమీపంలోకి రాగానే టైరు పగిలి నిప్పురవ్వలు ఎగిసిపడిన ప్రమాదంలో లారీకి మంటలంటుకొని అకస్మాత్తుగా వ్యాపించి మంటలలో లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.
- Advertisement -