Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన లారీ

ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన లారీ

- Advertisement -

ద్విచక్ర వాహన డ్రైవర్‌, డాక్టర్‌ మృతి
బేగంపేట గ్రీన్‌ల్యాండ్‌ వద్ద ఘటన


నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ర్యాపిడో బైక్‌ను ఇసుక లారీ ఢీకొట్టడంతో డ్రైవర్‌తో పాటు బైక్‌ వెనుక కూర్చున్న డాక్టర్‌ మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గ్రీన్‌ల్యాండ్స్‌ వద్ద వైట్‌హౌస్‌ ఎదురుగా జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గ్రీన్‌ ల్యాండ్స్‌ నుంచి బేగంపేట్‌ వైపు వెళ్తున్న 16 టైర్ల ఇసుక లారీ ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ర్యాపిడో డ్రైవర్‌ ముద్దంగల్‌ నవీన్‌(30) అక్కడికక్కడే మృతిచెందాడు.

వెనుక కూర్చున్న డాక్టర్‌ కస్తూరి జగదీష్‌చంద్ర (35)కు తీవ్రగాయాలు కాగా, స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో డాక్టర్‌ మృతి చెందాడు. నవీన్‌ స్వస్థలం ఖమ్మం జిల్లా హవేలిరూరల్‌కాగా, హైదరా బాద్‌లోని జేఎన్‌టీయూ వద్ద నివాసముంటూ రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తుంన్నాడు. డాక్టర్‌ కస్తూరి జగదీష్‌ చంద్రది కరీంనగర్‌ జిల్లా ధర్మపురి స్వస్థలం. బేగం పేట్‌లోని కుండన్‌బాగ్‌, మేతడిస్ట్‌ కాలనీలో నివాసముంటూ కిమ్స్‌-సన్‌షైన్‌ ఆస్పత్రిలో జనరల్‌ ఫిజీషియన్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తిం చారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. లారీ డ్రైవర్‌ పసుపుల శంకర్‌ను నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -