Monday, October 6, 2025
E-PAPER
Homeమానవిఉల్లితో బోలెడు ఆరోగ్యం..

ఉల్లితో బోలెడు ఆరోగ్యం..

- Advertisement -

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది సామెత. నిజంగానే దీంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇది ఏ వయస్సు వారికైనా ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా దీని వినియోగం హృద్రోగులకు, వృద్ధులకు మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఉల్లిగడ్డల్లో అనేక పోషకాలున్నాయి.
ఉల్లి వినియోగం రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఇందులో అధిక మొత్తంలో సల్ఫర్‌ ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. ఉల్లిలో ఉండే క్వెర్సెటిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్‌, ఫైబర్‌, ఇతర పోషకాలు ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.. వీటిని సలాడ్‌లలో వాడుకోవచ్చు. బ్రెడ్‌లో పచ్చి ఉల్లి, టొమాటో, ఇతర కూరగాయలను కలపడం ద్వారా శాండ్‌విచ్‌ తయారు చేసుకోవచ్చు. అలాగే పచ్చి ఉల్లిని సన్నగా తరిగి చట్నీలో కలపాలి. ఉల్లిని తక్కువ నూనెలో వేయించి కూడా తినవచ్చు. ఇతర కూరగాయలతో సూప్‌ తయారు చేసి తాగవచ్చు.. వీటిని క్రమం తప్పకుండ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు మీ సొంతం చేసుకోవచ్చు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -