- Advertisement -
ఇప్పుడు
మా కడుపులలో విషనాగులు పుడుతున్నాయి
కళ్ళనే కాదు కంటి పాపలని కూడా
పొడుచుకు తినే కాలనాగులను కంటున్నాం
కొత్త కొత్త ప్రేమలు పుట్టుకొచ్చి
పేగు బంధాలనే తెంపుకుంటున్నాయి
మా శరీరాలు పంచి ఇచ్చిన రక్తం
కాలకూట విషమయ్యింది
యవ్వనానికి రెక్కలు మొలిచి
డొక్కల్లో నిర్దాక్షిణ్యంగా తన్ని పోతున్నాయి
ప్రేమలు కలుషితం అయి
మానవత్వం పొగుచూరింది
బిడ్డలారా మీ ప్రేమలు వర్ధిల్లాలి
మీ హృదయాంతరాలలో మాత్రం కాదు
మా సమాధులపై దిష్టి బొమ్మలై…
(వికారాబాద్ జిల్లాలో తన ప్రేమను అంగీకరించలేదని తల్లిదండ్రులిద్దరిని విషమిచ్చి చంపిన కూతురి దాష్టీకాన్ని నిరసిస్తూ….)
డా.నామోజు బాలాచారి
- Advertisement -



