Saturday, July 12, 2025
E-PAPER
Homeసినిమా'లవ్‌ యు మోనికా..'

‘లవ్‌ యు మోనికా..’

- Advertisement -

రజనీకాంత్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ నిర్మించిన పాన్‌ ఇండియా యాక్షన్‌ మూవీ ‘కూలీ’. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం మేకర్స్‌ ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేశారు. ‘మోనికా.. లవ్‌ యు మోనికా..’ అంటూ సాగే ఈ పాట ఎక్స్‌ప్లోజివ్‌ నెంబర్‌గా అలరిస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన మూవ్స్‌తో కట్టిపడేసింది. ఆమెతో పాటు సౌబిన్‌ షాహిర్‌ కూడా కనిపించడం ట్రాక్‌కు మరింత ఎనర్జీ తీసుకువచ్చింది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ మరో చార్ట్‌బస్టర్‌ను కంపోజ్‌ చేశారు. అనిరుధ్‌, శుభలక్ష్మి కలసి హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్‌లో అసల్‌ కోలార్‌ రాప్‌ ఫ్రెష్‌ నెస్‌ యాడ్‌ చేసింది. ఈ మూవీలో అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, సత్యరాజ్‌ వంటి స్టార్స్‌ నటించారు. నిర్మాత కళానిధి మారన్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌ పాన్‌-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా డి.సురేష్‌ బాబు, దిల్‌ రాజు, సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌ యాజమాన్యంలోని ఆసియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -