Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలులక్కీ డ్రా విజేత శ్రీష్టిక

లక్కీ డ్రా విజేత శ్రీష్టిక

- Advertisement -

సోమేశ్వర ఇవి మోటార్స్ 
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర ఈవి మోటార్స్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్కీ డ్రా తీశారు. సోమవారం అందరి సమక్షంలో జరిగిన లక్కీ డ్రాలో శ్రీష్టిక విజేతగా నిలిచారు. బ్యాటరీతో నడిచే టూ వీలర్ వెహికల్ ఆమె సొంతమైంది. ఈ సందర్భంగా సోమేశ్వర ఇవి మోటార్స్  నిర్వాహకులు వినోద్ చారి మాట్లాడుతూ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి లక్కీ డ్రా నిర్వహించబడుతుందని, కేవలం రూ.300 కూపన్ కొనుగోలుతో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నారు.

ఇందులో 200 మంది సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తదుపరి లక్కీ డ్రా ఉగాది సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతగా గెలుపొందిన వారికి ఘనంగా సత్కారం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, జర్నలిస్టులు పోతుగంటి సంపత్ కుమార్, బైరి విశ్వనాథం, దూడల సాగర్‌లకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్కీ డ్రా సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -