- Advertisement -
పున: దర్శనాలు సోమవారం ఉదయం 6:30 గంటలకు..
నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మండలంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని చంద్రగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ఈనెల 7న ఆదివారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు మూసివేశారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఈనెల 8న సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని ఆలయ అధికారి వేణు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. చంద్రగ్రహాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని మూసి వేయడం జరుగుతుందని, భక్తులు అర్థం చేసుకొని ఈనెల 8న ఉదయం 6:30 గంటలకు భక్తులు సందర్శన కోసం రావాలని తెలియజేశారు.
- Advertisement -