Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలుసిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వండాలి

సిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వండాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి 

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వంట చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో కట్టెల ద్వారా వంట చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని, అన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ ద్వారానే మధ్యాహ్న భోజనానికి వంట చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ఎల్పిజి కనెక్షన్ ప్రతి పాఠశాలలో తీసుకునే విధంగా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రాబోయే నెల రోజుల్లో కనెక్షన్లు తీసుకునే ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ హెడ్మాస్టర్లు ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం సందర్శనలు చేయాలన్నారు. పాఠశాలల విజిట్స్ కు సంబంధించి అక్టోబర్ నెలలో నిర్దేశించిన లక్ష్యాలను రాబోయే రెండు రోజుల్లో సాధించాలన్నారు. విద్యార్థులకు అపార్ ఐడి జనరేషన్ లో మెరుగుదల కనిపించిందని, ఇంకా వేగంగా అపార్ ఐడి జనరేషన్ ప్రక్రియ నిర్వహించి మొత్తం విద్యార్థులకి పూర్తి చేయాలన్నారు. ఇక గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణిత విషయానికి సంబంధించిన మార్కుల రిపోర్టులను ఎప్పటికప్పుడు నివేదించాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు.

అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు హెల్త్ చెకప్స్ చేయించడమే కాకుండా అట్టి సమాచారాన్ని సంబంధిత పీఎం పోషన్ పర్ఫామెన్స్ పోర్టల్ లో అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన ఎఫ్ఆర్ ఎస్ అటెండెన్స్ సైతం మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, మండల విద్యాశాఖ అధికారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -