Sunday, September 28, 2025
E-PAPER
Homeక్రైమ్ద్విచక్ర వాహనాలు ఢీకొని మధ్యప్రదేశ్ యువకుడు మృతి 

ద్విచక్ర వాహనాలు ఢీకొని మధ్యప్రదేశ్ యువకుడు మృతి 

- Advertisement -

ఇద్దరికీ తీవ్ర గాయాలు..
నవతెలంగాణ-పాలకుర్తి

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో మధ్యప్రదేశ్ కు చెందిన భవన కార్మిక యువకుడు సుకుమార్ దార్వే (23) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి పాలకుర్తిలో గల ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మెర గ్రామానికి చెందిన గుర్రం శోభన్ మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై బొమ్మర నుండి పాలకుర్తి కి స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు వస్తుండగా.. భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలఘాడ్ ప్రాంతానికి చెందిన సుకుమార్ గార్వేతో కలిసి మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఆలయ సమీపంలో ఉన్న అద్దె ఇంటికి వెళ్ళుచుండగా ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయని తెలిపారు.

సుకుమార్ దార్వే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గుర్రం శోభన్ కు తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. క్షతగాత్రులను పాలకుర్తి పోలీస్ కానిస్టేబుల్ గొడిశాల రవి, మనోహర్, సూర్య ప్రకాష్ లు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించారని, అనంతరం మెరుగైన వైద్యం కోసం జనగామ కు తరలించారని తెలిపారు. సుకుమార్ దార్వే మృతి చెందడంతో పోస్టుమార్టం నిమిత్తం జనగామకు తరలించామని తెలిపారు. హెల్మెట్లు లేకపోవడం వల్లనే యువకుడి ప్రాణాలు గాలిలో కలిశాయని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. మృతుడి బంధువుల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -